![]() |
![]() |
.webp)
రీతూ చౌదరి.. ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న నటి. రీతూ తన కెరీర్ ని ఒక మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా మొదలు పెట్టింది. అంతేకాకుండా యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా చేసిన పెళ్లి చూపులు షోకి వచ్చి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం రీతూ జబర్దస్త్ లో చేస్తోంది. అంతేకాకుండా 'ఇంటిగుట్టు' సీరియల్ లో నెగెటివ్ రోల్ లో యాక్టింగ్ చేసి అందరిని మెప్పించిన విషయం తెలిసిందే. అప్పట్లో యాంకర్ విష్ణుప్రియ, రీతూ కలిసి బ్యాంకాక్ బీచ్ లో సందడి చేసిన ఫోటోస్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
రీతూ చౌదరి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తనకి విపరీతమైన సింపతీ లభించింది. ఆ తర్వాత పలు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఒకవైపు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో, మరొక వైపు జబర్దస్త్ షోలో నటిస్తూ బిజీగా ఉంటోంది రీతూ. అయితే తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేసింది. ఫోటోషూట్ లతో ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటూ, ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉంటోంది.
ఇన్ స్టాగ్రామ్ లోని సెలబ్రిటీలలో చిన్న, పెద్ద అని తేడా లేకుండా దాదాపు అందరూ.. 'ఆస్క్ మి క్వశ్చనింగ్' అంటూ నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతుంటారు. తాజాగా రీతూ మాట్లాడుకుందామా అంటూ కాసేపు తన ఫ్యాన్స్ తో ముచ్చటించింది...మిమ్మల్ని బిగ్ స్క్రీన్ పై చూడాలని అనుకుంటున్నామని ఒకరు అడుగగా.. మీ బ్లెస్సింగ్స్ ఉండాలని రీతూ చెప్పింది. డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఎనీ సజెషన్ అంటూ ఒకరు అడుగగా... బేసిక్ గా నేను డిప్రెషన్ పర్సన్. బాధ అనిపిస్తే బాధ పాటలు పెట్టుకొని ఏడుస్తాను. ఆ సిచువేషన్ ఓవర్ కమ్ చెయ్యాలి. ఏది అనిపిస్తే అది చెయ్యాలి. ఆ తర్వాత ఆ సిచువేషన్ లో మనం హ్యాపీగా ఉండొచ్చని రీతూ రిప్లై ఇచ్చింది. మీలాగా క్యూట్ గా ఉండే అమ్మాయి దొరకాలని ఒకరు అడుగగా.. అందరు అమ్మాయిలు క్యూట్ గానే ఉంటారు. మనం చూసే చూపుని బట్టి ఉంటుందని రీతూ రిప్లై ఇచ్చింది.
![]() |
![]() |